మహేష్ బాబు తాజాగా 'ఖలేజా చూపిద్దాం..కుమ్మేద్దాం రండి' అనే
స్లోగన్ తో అలరించనున్నాడు. ధమ్స్ అప్ తో కలిసి ఖలేజా ప్రమోషన్ చేయటానికి ఈ
పంచ్ లైన్ ని ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయన పుట్టిన రోజైన(సోమవారం)శ్రీకారం
చుట్టారు. ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'థమ్స్ అప్ కలేజా ఉందా' ప్రచార కార్యక్రమాన్ని సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్‌బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ...థమ్సప్ తో నాది నాలుగేళ్ల అనుబంధం. ఎంతో మంది సూపర్ స్టార్ లతో వర్క్‌చేసిన బ్రాండ్ తో నేను కూడా పని చేయడం చాలా ఆనందంగా ఉంది. చి న్నప్పటి నుండి కూడా ఈ బ్రాండ్‌తో క్లోజ్‌గా అసోసియేట్ అయ్యాను. వీరి యాడ్ క్యాంపెయిన్లు అన్నీ యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి. నా సినిమాలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది పడ లేదు. అలాగే 'ఖలేజా ఉందా..?' కాంటెస్ట్ ద్వారా 30 మంది అభిమానులు నాతో కలిసి నా తరువాతి సినిమాలో నటించే అవకాశం పొందుతారు అని చెప్పారు. ఇక 'థమ్స్ అప్ కలేజా ఉందా'లో పాల్గొనాలంటే ఇలా చేయాలి...థమ్స్ అప్ బాటిల్ మూతపై, పెట్ బాటిల్ లేబుల్ వెనుక ఉండే తొమ్మిది అంకెల కోడ్ కోసం చూడండి. మహేష్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 'యూనిక్ కోడ్'తో 09869 98 98 98కు ఎస్ ఎం ఎస్ చేయాలి. ఎస్ ఎంఎస్ పంపినవారిలో 30 మందిని డ్రా ద్వారా ఎంపిక చేసి మహేష్ బాబుతో స్టంట్స్ యాక్షన్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ ఆఫర్ ను ఈనెల 10 నుంచి సెప్టెంబర్ 9 వతేదీ వరకు వినియోగించుకోవచ్చు |
Wednesday, August 11, 2010
Khaleja Unda......
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment